ఆంధ్రప్రదేశ్ లో ఎల్లుండి నుంచి ఆంక్షలు,ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వారికే అనుమతి ఆ తరువాత 144 సెక్షన్
ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. సెకండ్ వేవ్ రూపంలో మహమ్మారి విరుచుకుపడుతోంది. రోజుకు సుమారు ఇరవై వేల పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలన్నీ నిండిపోయాయి. బెడ్లు దొరకక ఆస్పత్రుల్లోని ఆరుబయటే వీల్ చైర్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు కరోనా బాధితులు. ఈ క్రమంలో కోవిడ్–19 నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి (బుధవారం) నుంచి రాష్ట్రంలో ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్నారు. కోవిడ్‌పై సమీక్షలో సీఎం వైయస్ జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని షాపులకు అనుమతిస్తారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలు అవ్వనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చు. అయితే ఆ సమయంలో కూడా 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది. ప్రజలు కోవిడ్ -19 కట్టడికి సహకరించాలని.. కరోనా నిబంధనలు పాటించాలని సీఎం కోరారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ పోలీస్ శాఖను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రాత